- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది ఇండియా స్టోరీ’ సినిమా అప్డేట్ ఇచ్చిన కాజల్.. శక్తివంతమైన కథ రాబోతుందంటూ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ఇటీవల ‘కన్నప్ప’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ఇటీవల ‘కన్నప్ప’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ది ఇండియా స్టోరీ’ (The India Story)మూవీతో రాబోతుంది. ఇందులో శ్రేయాస్ తల్సాడే (Shreyas Talsade)సరసన హీరోయిన్‌గా నటించనుంది. డీకే చేతన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎమ్ఐజీ ప్రొడక్షన్స్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బి. షిండే నిర్మిస్తున్నారు. ఇక ఇందులో కాజల్ లాయర్ పాత్రలో కనిపించబోతుంది. రైతుల కష్టాలు, కార్పొరేట్ సంస్థలు తయారు చేసే పంటల పిచికారీ మందుల వ్యాపారం వంటి అంశాల నేపథ్యంతో రాబోతుంది. ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన నిజమైన పురుగు మందుల కుంభకోణాల ఆధారంగా రాబోతున్న ఈ ఉత్కంఠభరితమైన డ్రామా వివాదాస్పద ప్రపంచం చుట్టూ తిరుగుతుంది.
ఇందులో మనీష్ వాధ్యా, త్రిషా సర్ధా, మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా, ‘ది ఇండియా స్టోరీ’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ కాజల్ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు తెలుపుతూ.. ఫొటోలు షేర్ చేసింది. అలాగే ఈ శక్తివంతమైన కథను మీకు స్క్రీన్‌పై చూపించే వరకు నేను వేచి ఉండలేకపోతున్నానని తెలిపింది. ఇక కొన్ని కోర్టు సీన్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. కాగా, ‘ది ఇండియా స్టోరీ’ సినిమా ఆగస్టు నెలలో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ చిత్రాన్ని మూవీ మేకర్స్ వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. లింక్






