నా బిడ్డను చూడగానే ఈ ప్రపంచం కనుమరుగైంది : Kajal Aggarwal ఎమోషనల్

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-30 16:26:00  IST  )

దిశ, సినిమా : స్టార్ నటి కాజల్ అగర్వాల్ తల్లీబిడ్డల అనుబంధం గురించి కోస్టార్ నేహా ధూపియాతో కలిసి ఆసక్తికర విషయాలు పంచుకుంది..Latest Telugu News

నా బిడ్డను చూడగానే ఈ ప్రపంచం కనుమరుగైంది : Kajal Aggarwal ఎమోషనల్
X

దిశ, సినిమా : స్టార్ నటి కాజల్ అగర్వాల్ తల్లీబిడ్డల అనుబంధం గురించి కోస్టార్ నేహా ధూపియాతో కలిసి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవలే మాతృత్వం పొందిన కాజల్ బాబును విడిచి నిమిషమైనా ఉండలేకపోతున్నట్లు తెలిపింది. గంటసేపు జిమ్‌కు వెళ్లడం కూడా కష్టంగా ఫీల్ అవుతున్నానన్న నటి.. పేరెంట్‌హుడ్ పైకి ఎంత అందంగా కనిపించినా సవాల్‌తో కూడుకున్నదని అంగీకరిస్తున్నట్లుగా వెల్లడించింది. ఇక ఇంటి బాధ్యతలు, కెరియర్‌ను బ్యాలన్స్ చేసుకోవడం అనుకున్నంత సులభం కాదన్న కాజల్.. పిల్లలకు కాస్త దూరంగా ఉన్నప్పుడు అందరిలాగే తను కూడా అపరాధ భావంతో ఉంటానని పేర్కొంది.

'ఫీడింగ్ విషయంలో చాలా చొరవ తీసుకుంటా. ఇంట్లో ఇతరుల సాయం ఉన్నప్పటికీ బిడ్డను ఒంటరిగా వదిలేయడం అసౌకర్యంగా, ఆత్రుతగా ఉంటుంది. మొదటిసారి బేబీని నా ఛాతిపై పెట్టి చూపించినప్పుడు ఈ ప్రపంచం కనుమరుగైంది. నేను ఏడుస్తూనే ఉన్నా. తొమ్మిది నెలల కష్టాలు సవాళ్లు మాయమయ్యాయి' అంటూ ఎమోషనల్ అయింది. అంతేకాదు రాత్రి పిల్లాడు పడుకున్నాక డిన్నర్ కోసం బయటికి వెళ్లాలనే ఆలోచనలు వచ్చినప్పటికీ ఎప్పుడు మేల్కొంటాడోనన్న భయంతో అప్రమత్తంగా పక్కనే ఉంటానంటూ వివరించింది.

Also Read : కాన్పుల మధ్య అంతరం ఎంత ఉండాలి?

Next Story