అతనికి లిప్ కిస్ పెట్టిన చందమామ.. కుల్లుకుంటున్న ఫ్యాన్స్

by Disha Web Desk 10 |
అతనికి లిప్ కిస్ పెట్టిన చందమామ.. కుల్లుకుంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : స్టార్ నటి కాజల్‌ అగర్వాల్‌ బ్యూటీఫుల్ పిక్‌తో అభిమానులను అలరించింది. పైళ్లైనప్పటినుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్న నటి..తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి సెలబ్రేషన్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే క్రిస్మస్‌ పార్టీకి సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయగా..ఇందులో తన భర్త గౌతమ్‌ తమ కుమారుడిని ఎత్తుకోగా ఆమె గౌతమ్ ముందు నిలబడి రొమాంటిక్ యాంగిల్‌లో లిప్ కిస్ పెడుతూ కనిపించింది. ఇక 'ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్‌' అని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చిన పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 'ఆ ఒక్క ముద్దుతో..నా రెండు జేబుల్లో చేతులు పెట్టి ఎక్కడికెళ్తున్నానో నాకే తెలియదు', 'చందమామను కలల రాణిగా ఉహించుకున్న అభిమానులకు ఈ ముద్దు చూస్తే గుండె పోటే' అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.



Next Story

Most Viewed