- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kajal Aggarwal: కొత్త అవతారంలో కాజల్... ఇకపై అన్ని బోల్డ్ పాత్రలే !
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో గత 15 సంవత్సరాలుగా అగ్ర హ

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో గత 15 సంవత్సరాలుగా అగ్ర హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్... కన్నప్ప సినిమాలో ( Kannappa Movie) మెరవనుంది. పెళ్లి తర్వాత ఏడాదికి ఒక సినిమా లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తోంది.
అయితే ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా... ఓ సినిమా కోసం దర్శకుడి అవతారం ఎత్తబోతోందట. దీనికోసం ఒక కథ సిద్ధం చేసుకున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ సినిమాకు ఆమె దర్శకత్వం వహిస్తుండగా... హీరోయిన్ గా కూడా ఆమెనే నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.
ఇందులో చాలా బోల్డ్ గా కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సినిమా నువ్వే తీసి... నువ్వే హీరోయిన్ అయితే ఎలా ఉంటుంది?అబ్బా కాజల్ అగర్వాల్ స్కెచ్ అదిరిపోయింది.. డబ్బులు బాగా సేవ్ అవుతాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా... కన్నప్పలో పార్వతీ దేవి పాత్రలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కట్టించబోతున్న సంగతి తెలిసిందే.






