- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కైకాల విలక్షణ నటుడు: CM కేసీఆర్
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఫిల్మ్ నగర్‌లోని కైకాల ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కైకాల కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. కైకాల విలక్షణ నటుడు అని.. ఆయన మన మధ్య లేకపోవడం బాధకరమని అన్నారు. రేపు మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు అధికారంగా నిర్వహించాలని.. మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో రేపు ఉదయం 10.30 గంటలకు కైకాల అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
Next Story






