ఓటీటీలోకి రాబోతున్న ‘కె-ర్యాంప్’.. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

బాక్సాఫీసు వద్ద ఎంత పెద్ద విజయం సాధించినప్పటికీ స్టార్ హీరోల సినిమాలు సైతం నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

ఓటీటీలోకి రాబోతున్న ‘కె-ర్యాంప్’.. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: బాక్సాఫీసు వద్ద ఎంత పెద్ద విజయం సాధించినప్పటికీ స్టార్ హీరోల సినిమాలు సైతం నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఎన్ని రికార్డులు సాధించినా లాభం లేకుండా పోతుంది. కొన్ని చిత్రాలైతే మరీ దారుణంగా విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ లీక్ అయిపోతుంది. దీనివల్ల థియేటర్స్‌లో ఎక్కువ రోజులు ఆడకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వారానికి దాదాపు 15 చిత్రాలైనా స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

దీపావళి కానుకగా వచ్చి విజయం అందుకున్న ‘కె-ర్యాంప్’ (K-Ramp)నెలకే రాబోతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. నవంబర్ 15న స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఇక ఇందులో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యుక్తి తరేజా(Yukti Tareja) జంటగా నటించారు. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన జైన్స్ నాని మొదటి ప్రాజెక్ట్‌తోనే హిట్ అందుకున్నాడు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. అలాగే విడుదలైన మొదటి షో నుంచి సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిన ఈ చిత్రం పలు రికార్డులు క్రియేట్ చేసింది.

link

Next Story