- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Priyamani: ప్రియమణి ‘గుడ్ వైఫ్’ రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చిన జియో హాట్ స్టార్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి (Priyamani)గతంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి (Priyamani)గతంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఎన్నో హిట్ మూవీస్ చేసిన ప్రియమణి కొద్ది కాలం అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ నాగచైతన్య ‘కస్టడీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది ఓ రెండు చిత్రాలు, భామ కలాపం సిరీస్‌తో అలరించింది. ప్రస్తుతం ప్రియమణి ‘గుడ్ వైఫ్’(Good Wife) సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమెరికన్ సిరీస్‌ను రిమేక్ చేస్తున్నారు. అయితే దీనిని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో ప్రియమణి లాయర్‌గా నటిస్తుండగా.. ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ కనిపించనున్నారు. వీళ్లకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు మాజీ భార్య ఏం చేసిందనేది ఈ సిరీస్ కథ అని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.






