కొత్త సినిమాను ప్రకటించిన జీవా.. క్యూరియాసిటీ పెంచుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో జీవా(Jiiva) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇటీవల ‘అగత్యా’చిత్రంతో వచ్చి ప్రేక్షకులను అలరించారు.

కొత్త సినిమాను ప్రకటించిన జీవా.. క్యూరియాసిటీ పెంచుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో జీవా(Jiiva) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇటీవల ‘అగత్యా’చిత్రంతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం జీవా తన కొత్త సినిమాను ప్రకటిస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ సినిమా ఆయన కెరీర్ 45వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. నితీష్ సహదేవ్ (Nitish Sahadev)దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఈ చిత్రం ‘తలైవార్ తంబి తలైమైల్’ (ThalaivarThambiThalaimaiyil )టైటిల్‌తో రాబోతుండగా.. కన్నన్ రవి బ్యానర్‌పై కన్నన్ రవి, దీపక్ రవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందిస్తున్నారు. ఇక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికొస్తే.. ఏదో జాతరలో భాగంగా కొతమంది జీవాను పడుకోబెట్టినట్లుగా ఎత్తుకుని ఉండగా.. ఆయన మాత్రం ఏదో చూసి షాక్ అవుతున్నట్లు కనిపించాడు. ఆయనపై పక్కన ఉన్న అమ్మాయిలు కొందరు పూలు చల్లుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

link

Next Story