ఈ నాలుగేళ్లలో ఆయన పాత్రలో ఎన్నో మార్పులు చేశా.. ‘దృశ్యం-3’ పై అంచనాలు పెంచేసిన జీతూ జోసెఫ్

by Mallepaka Hamsa |

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal),జీతూ జోసెఫ్(Jeetu Joseph) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘దృశ్యం-3’(Drishyam-3).

ఈ నాలుగేళ్లలో ఆయన పాత్రలో ఎన్నో మార్పులు చేశా..  ‘దృశ్యం-3’ పై అంచనాలు పెంచేసిన జీతూ జోసెఫ్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal),జీతూ జోసెఫ్(Jeetu Joseph) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘దృశ్యం-3’(Drishyam-3). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘దృశ్యం-2’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. మూవీ టీమ్ షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు జీతు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘దృశ్యం-3కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించబోతున్నాం.ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. గతంలో వచ్చిన రెండు భాగాలు విజయం సాధించడంలో నేను ఆనందంగా ఉన్నాను. విజయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల ఆదరణ నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. మోహన్‌లాల్ పాత్ర అందరికీ నచ్చింది. ఆయన నాకు ఎప్పుడూ జార్జ్ కుట్టినే. ఈ నాలుగేళ్లలో ఆయన పాత్రలో ఎన్నో మార్పులు చేశాను. మూడో పార్ట్ పూర్తి భిన్నంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. కానీ రెండో భాగంలో ఉన్నట్లు హై-ఇంటెలిజెన్స్ సీన్స్ ఉంటాయని అంచనాలు పెట్టుకుంటే మాత్రం వారికి నిరాశే ఎదురవుతోంది. ఎందుకంటే ఇది పూర్తి భిన్నంగా రానుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది తెలుసుకున్న సినీ ప్రియులు అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story