Jawan OTT: రికార్డు స్థాయిలో ‘జవాన్’ ఓటీటీ రైట్స్.. ఏకంగా రెండింట్లో స్ట్రీమింగ్

by Disha Web Desk 9 |
Jawan OTT: రికార్డు స్థాయిలో ‘జవాన్’ ఓటీటీ రైట్స్.. ఏకంగా రెండింట్లో స్ట్రీమింగ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు రూ.574 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సెట్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ హక్కుల కోసం చాలా సంస్థలు పోటీపడగా ఆఖరుకు దిగ్గజ సంస్థ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. రికార్డు స్థాయిలో రూ.250 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హిందీ వెర్షన్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కులు జీ తెలుగు దక్కించుకుందని సమాచారం. ఇక అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Read More: ఆ విషయంలో నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి.. శోభిత వైరల్ కామెంట్స్

Next Story

Most Viewed