- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sudheer Babu: ‘జటాధర’ టీజర్ అప్డేట్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో హైప్ పెంచిన సుధీర బాబు
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) గత ఏడాది ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) గత ఏడాది ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది కానీ హిట్ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాథలాజికల్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’(Jatadhara). వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఈ మూవీలో రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అనంత పద్మనాభ స్వామి ఆలయం కథాంశంతొ మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘జటాధర’ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వరుప అప్డేట్స్ విడుదలవుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ‘జటాధర’ నుంచి అప్డే్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రాఖీ పండుగ కానుకగా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 8న రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ పవర్ పుల్ పోస్టర్‌ను కూడా షేర్ చేసి అంచనాలను రెట్టింపు చేశారు.
ఇక ఇందులో సుధీర్ బాబు ఒంటినిండా రక్తంతో ఉండగా.. త్రిషూలం పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించగా.. సోనాక్షి సిన్హా పెద్ద కత్తి పట్టుకుని అరుస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘వేచి ఉండటం ముగిసింది! జటాధర యొక్క పురాణాలను కలిసే దృశ్యాన్ని వీక్షించండి. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా తెరపై వెలిగిపోతాయి. ఆగస్టు 8న టీజర్ విడుదల కాబోతుంది. చరిత్ర రూపొందుతోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు.






