దిగజారి ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి ధోరణి ప్రోత్సహించకూడదంటూ జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |

సెలబ్రిటీలు మరణించినప్పుడు మీడియా వ్యవహరిస్తున్న తీరు కొందరికి అసహనాన్ని కలిగిస్తోంది.

దిగజారి ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి ధోరణి ప్రోత్సహించకూడదంటూ జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: సెలబ్రిటీలు మరణించినప్పుడు మీడియా వ్యవహరిస్తున్న తీరు కొందరికి అసహనాన్ని కలిగిస్తోంది. కొన్నిసార్లు నటుడు మరణించకముందే.. కొందరు యూట్యూబ్ ఇన్ఫ్లుయేన్సర్లు చనిపోయినట్లుగా వీడియోలను క్రియేట్ చేస్తుంటారు. అంతేకాకుండా వాటిని వైరల్ చేసి అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంటారు. అలాగే పలు మీమ్స్ కూడా చేస్తారు. ఇటీవల లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర మరణించకముందే పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు కంగారు పడటంతో.. ఈ విషయంపై ఆయన కూతురు స్పందించి క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది. కానీ ఈ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ధర్మేంద్ర మరణించారు. ఇక సెలబ్రిటీలు మరణించిన సమయంలో మీడియా ప్రవర్తించే తీరుపై ఇప్పటికే ఎంతోమంది తమ అభిప్రాయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor)తన తల్లి చనిపోయినప్పుడు కూడా కొందరు దారుణంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ఇండస్ట్రీకి రాకముందే మా అమ్మ నన్ను విడిచి వెళ్లిపోయింది. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చాక.. నా తల్లిని గుర్తు చేసుకుని చేసిన కామెంట్స్‌పై కొందరు చాలా దారుణంగా మీమ్స్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా నన్ను టార్గెట్ చేసి మాట్లాడేవారు. అవి చూసి కొన్ని రోజులు అన్నిటికీ దూరంగా ఉన్నాను. ఆ కాలాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఈ సమయంలో నేను చెప్పినవాటన్నింటినీ తప్పుగానే చూసేవారు. నా తల్లి మరణించిందని బాధపడితే దాన్ని కూడా అపహస్యం చేస్తారని అనుకోలేదు. ఇటీవల ధర్మేంద్ర(Dharmendra) విషయంలోనూ కొందరు మరింత దిగజారి ప్రవర్తించారు.

సెలబ్రిటీల విషయంలో ఇలా జరగడం మొదటిసారి కాదు. వ్యూస్, లైక్స్ కోసం ఇష్టం వచ్చింది రాస్తూ.. వైరల్ చేసి ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి ధోరణిని ప్రోత్సహించకూడదు. లేదంటే చాలా దారుణాలు సృష్టించి సెలబ్రిటీల జీవితాలతో ఆడుకుంటారు’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)సరసన ‘పెద్ది’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో స్టార్స్ జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ వంటి వారు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story