- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ అందుకున్న జాన్వీ కపూర్.. డబుల్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది.

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (peddi)హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు దేవర-2, సరమ్ సుందరి వంటి చిత్రాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్ కొత్త సినిమాను ప్రకటించింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన బంపర్ ఆఫర్ అందుకుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారీ కి తులసి కుమారి’(Sunny Sanskari Ki Tulasi Kumari).
ఈ సినిమాను శశాంక్ ఖైతాన్(Shashank Khaitan) తెరకెక్కిస్తుండగా.. దీనిని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అధార్‌పూర్ణావాలా, అపూర్వ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో సన్యా మల్హోత్రా(Sanya Malhotra), రోహిత్‌షరాఫ్, మణిపాల్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో వరుణ్ సన్నీ సంస్కారి పాత్రలో నటిస్తుండగా.. జాన్వీ తులసి కుమారిగా కనిపించనుంది. అయితే గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విషయానికొస్తే.. వరుణ్ చెతులకు బ్లాక్‌లెట్, వాచ్ పెట్టుకుని దండం పెడుతూ కనిపించగా.. జాన్వీ కపూర్ గోల్డ్ చీరలో మెస్మరైజింగ్ లుక్‌లో కనిపించి అందరినీ ఫిదా అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. గోల్డెన్ గర్ల్ చాలా క్యూట్ ఉన్నవ్ ఎక్జైటింగ్‌గా ఉన్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.






