రష్మికను తొక్కేస్తున్న ఇద్దరు సెక్సీ హీరోయిన్స్.. వారు ఎవరంటే?

by Disha Web Desk 8 |
రష్మికను తొక్కేస్తున్న ఇద్దరు సెక్సీ హీరోయిన్స్.. వారు ఎవరంటే?
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగాలని చాలా మంది కోరకుంటారు. అలాగే ఏ హీరోయిన్‌కైతే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్‌లో క్రేజ్ ఉంటుందో, తనకు మంచి ఆఫర్స్ వస్తుంటాయి.ఇక ఒకప్పుడు టాప్ ప్లేస్‌లో ఉన్న వారు ఇప్పుడు చివరిలో కూడా ఉండొచ్చు. పొజిషన్స్ ఎప్పుడు ఎలా మారుతాయో, ఎవ్వరికీ తెలియదు.

అయితే నిన్న మొన్నటి వరకు రష్మిక మందన టాలీవుడ్ టాప్‌లో కొనసాగుతూ.. ఆఫర్స్ అన్నీ అందుకుంది. ఐతే, ఇప్పుడు ఆ అమ్మడు ఆఫర్స్ అన్నీ ఇద్దరు సెక్సీ హీరోయిన్స్ ఎగరేసుకపోతున్నారంట. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా? మన అందాల ముద్దుగుమ్మలు మృణాలు, జాన్వీకపూర్.

వీరిద్దరికి ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫేమ్ ఉన్నదంట. డైరెక్టర్స్ రష్మిక‌ను కాదని వీరికే పిలిచి మరి ఆఫర్స్ ఇస్తున్నారంట. అంతే కాకుండా కొన్ని సినిమాల్లో రష్మికను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినప్పటికీ.. సైలెంట్‌గా తనను తప్పించి వీరిలో ఎవరినో ఒకరిని ఫిక్స్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక రష్మిక యానిమల్ మూవీతో మంచి సక్సెస్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప 2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇక జాన్వీ దేవరలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed