- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేటకు సిద్ధమైన ‘జననాయగన్’.. విడుదలపై వీడిన సస్పెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay)కెరీర్‌లో 69వ చిత్రంగా, ఆయన చివరి సినిమాగా వస్తున్న ‘జననాయగన్’ (Jana Nayagan).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay)కెరీర్‌లో 69వ చిత్రంగా, ఆయన చివరి సినిమాగా వస్తున్న ‘జననాయగన్’ (Jana Nayagan) కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్ నుంచి వస్తున్న ఫుల్ లెంగ్త్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు కేసుల కారణంగా విడుదల వాయిదా పడింది. దాదాపు నెల రోజుల ఉత్కంఠ తర్వాత, మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్‌తో వివాదాలన్నీ క్లియర్ కావడంతో.. ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
తాజా సమాచారం ప్రకారం, 'జననాయగన్' చిత్రాన్ని ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'U/A' (UA 16+) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. హెచ్. వినోద్(H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. బాబీ డియోల్, మమిత బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. విజయ్ వెండితెరపై కనిపించే చివరి సినిమా కావడంతో, ఫిబ్రవరి 20న బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీసు వద్ద విజయ్ వేటకు సిద్ధమయ్యాడని కామెంట్లు పెడుతున్నారు.






