సూపర్ స్టార్ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్.. వరల్డ్ రికార్డ్స్ టార్గెట్ చేసిన ‘వారణాసి’..!

by Mallepaka Hamsa |

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli)కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’(Varanasi)పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

సూపర్ స్టార్ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్.. వరల్డ్ రికార్డ్స్ టార్గెట్ చేసిన ‘వారణాసి’..!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli)కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’(Varanasi)పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత నెల విడుదలైన గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా సునామీ క్రియేట్ చేయగా, ఇప్పుడు మేకర్స్ మరో భారీ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో.. సరికొత్త రికార్డులు సృష్టించబోతోందని అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా టెక్నికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే.. ‘వారణాసి’ ఇండియన్ సినిమా నుంచి వస్తున్న రెండో IMAX వెర్షన్ మూవీగా గుర్తింపు పొందింది. ఇది మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, మన ఇండస్ట్రీలో కూడా ఓ అరుదైన ఘనత. అసలు విషయం ఏంటంటే.. ట్రైలర్ ప్రెజెంటేషన్‌లో రాజమౌళి చేసిన సరికొత్త ఎక్స్‌పెరిమెంట్. సాధారణంగా ట్రైలర్లు రెగ్యులర్ డిజిటల్ రేషియోలోనే రిలీజ్ అవుతాయి.

కానీ ‘వారణాసి’ ట్రైలర్‌ను 1.43 రేషియో IMAX ఫార్మాట్‌లోనే నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి, అందరినీ షాక్‌కు గురి చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిసారి అని మేకర్స్ గర్వంగా ప్రకటిస్తున్నారు. మొత్తానికి రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్డమ్, IMAX టెక్నికల్ స్టాండర్డ్ కలిపి ‘వారణాసి’ ని ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న మాసివ్ ప్రాజెక్ట్‌గా మార్చాయి. దీంతో ఈ మూవీ రిలీజ్‌కు ముందే హాలీవుడ్ స్థాయిలో సినిమాపై చర్చ మొదలైంది. కాగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

link

Next Story