అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన ‘జైలర్’

by Disha Web Desk 7 |
అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన ‘జైలర్’
X

దిశ, సినిమా: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘జైలర్’. రమ్యకృష్ణ, తమన్నా భాటియా, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్, యోగి బాబు లాంటి నటీనటులు ముఖ్య పాత్ర పోషించారు. కాగా ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమెరికాలో రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో మొత్తం 280 స్క్రీన్‌లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 8 లక్షల డాలర్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో 2023లో అడ్వాన్స్ బుకింగ్ ద్యారా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ‘జైలర్’ నిలిచింది.

Advertisement
Next Story

Most Viewed