Puspha 2: ‘పుష్ప2’నుంచి బిగ్ అప్‌డేట్.. స్టార్ విలన్ ఎంట్రీ?

by Disha Web Desk 10 |
Puspha 2: ‘పుష్ప2’నుంచి బిగ్ అప్‌డేట్.. స్టార్ విలన్ ఎంట్రీ?
X

దిశ, సినిమా: ‘పుష్ప ది రైజ్’ సినిమాతో గతేడాది సూపర్ డూపర్ హిట్టు కొట్టారు సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా పార్ట్ 2ను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో క్రేజీ స్టార్లను ఇంక్లూడ్ చేస్తున్నారనే టాక్‌ ఎప్పటి నుంచో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు ‘పుష్ప 2’లో సీనియర్ టాలీవుడ్ హీరో జగపతి బాబు కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో దనుంజయ్‌, సునీల్‌తో పాటు ఈ వార్‌లోకి జగపతి బాబును కూడా దింపుతున్నారట సుకుమార్. ఈ విషయంపై తనతో మాట్లాడారని, క్యారెక్టర్‌ గురించి కూడా చెప్పారని టాక్. జగపతి బాబు కూడా దీని గురించి ఓ ఇంటర్య్వూలో హింట్ ఇవ్వడంతో ఈ న్యూస్‌ హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Also Read...

ఆ ఒక్క కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడంట!

Next Story

Most Viewed