- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగ్గూభాయ్ ఎంట్రీతో దుల్కర్ మూవీకి కొత్త కళ.. ఆసక్తి రేపుతున్న మేకర్స్ పోస్ట్
వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu) ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మెప్పించి ఇప్పుడు విలన్ గా, పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది భాషలన్నింటిలో బిజీగా ఉన్నారు.

దిశ, సినిమా: వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu) ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మెప్పించి ఇప్పుడు విలన్ గా, పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది భాషలన్నింటిలో బిజీగా ఉన్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తండ్రి పాత్రల్లో తనదైన ముద్ర వేసిన జగ్గూభాయ్.. ఇటీవల 'మిరాయ్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు అదే ఊపుతో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటిస్తున్న తాజా చిత్రం 'DQ-41' లో ఒక కీలక పాత్రను దక్కించుకోవడంతో సినిమాకే కొత్త కళ వచ్చినట్లు అయింది. నేడు జగపతి బాబు పుట్టినరోజు కావడంతో, మూవీ మేకర్స్.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ ఫొటోలో జగ్గూభాయ్ చాలా కూల్‌గా, ఒక పుస్తకం చదువుతూ కనిపిస్తున్నారు. ఆయన లుక్ ఎంతో హుందాగా ఉండటంతో, ఈ సినిమాలో ఆయన పోషించే పాత్రపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఎలాంటి పాత్రలో నటిస్తున్నారనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికే జగపతి బాబు పాత్ర హైలెట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ టాక్. రవి నేలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌ఎల్వీ (SLV) సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు ఈ టీమ్‌లోకి జగపతి బాబు కూడా చేరడంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






