పార్క్‌లో లవర్‌తో అలా చేస్తూ దొరికిపోయిన వర్ష.. షాక్‌లో జబర్దస్త్ టీం!

by Dishanational2 |
పార్క్‌లో లవర్‌తో అలా చేస్తూ దొరికిపోయిన వర్ష.. షాక్‌లో జబర్దస్త్ టీం!
X

దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లకు తగ్గ అందం, తన కామెడీతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది వర్ష. అంతే కాకుండా ఫొటోషూట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో తన హాట్ హాట్ డ్యాన్స్ ఫర్మామెన్స్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ తన లవర్‌తో పార్క్‌లో దొరికిపోయింది. అయితే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్‌తో వర్ష లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు జబర్దస్త్‌లో కలరింగ్ ఇచ్చే విషయం తెలిసిందే. దీంతో చాలా మంది వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అనుకోవడమే కాకుండా, వీరు ప్రేమలో ఉన్నారంటూ చాలా వార్తలు ఆ మధ్య హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో ఈ అమ్మడు పార్క్‌క్‌లో తన లవర్‌తో కనిపించి అందరికీ షాకిచ్చింది.


అసలు విషయంలోకి వెళ్తే.. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమో రెండు రోజుల క్రితమే వచ్చింది. ఇందులో హైపర్ ఆది , ఇమ్మానుయేల్‌తో.. వర్షా నీకు తెలియకుండా ఎవరితోనూ రీల్స్ చేయదు, అని ఒక వీడియో ప్లే చేయించాడు. అందులో మాత్రం వర్ష ఒక అబ్బాయితో పార్కులో కనిపించింది. అంతేకాదు ఒకరి చేతి పై ఒకరు చేయి వేసుకొని రచ్చ చేశారు. దీంతో ఇది చూసిన జబర్దస్త్ టీం మొత్తం షాక్ అయ్యింది. ఒక్కసారిగా ఇమ్మానుయేల్, వర్షా అని గట్టిగా అరుస్తూ ఎవడు ఆడు.. నీకు రియల్ నేనా, లేకపోతే వాడా అంటూ ప్రవ్నిస్తాడు. దీనికి వర్ష సమాదానం ఇస్తూ, ఆగు నామీదే డౌటా అని అడగ్గా..ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా వర్ష ? నీవల్లే ఇదంతా అంటూ ఆదిని చూసి కామెడీని పంచాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: సారీ చెప్పిన ఉర్ఫీ.. ఇకపై అలాంటి డ్రెస్సింగ్‌లో కనిపించనంటూ కీలక నిర్ణయం



Next Story