సల్మాణ్ ఖాన్‌తో చాలా కష్టం.. రాత్రులు అలా చేస్తారంటూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) ఇటీవల ‘సికిందర్’ సినిమాతో భారీ డిజాస్టర్‌ను చవిచూశారు.

సల్మాణ్ ఖాన్‌తో చాలా కష్టం.. రాత్రులు అలా చేస్తారంటూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) ఇటీవల ‘సికందర్’ సినిమాతో భారీ డిజాస్టర్‌ను చవిచూశారు. ప్రస్తుతం ‘మదరాసి’(madharaasi) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శివ కార్తికేయన్(Siva Karthikeyan), రుక్మిణి వసంత్ జంటగా నటిస్తున్నారు. సైలకాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో విద్యుత్ జమాల్, బీజు మీనన్, ఫబ్బీర్ విక్రాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురుగదాస్ సల్మాన్ ఖాన్‌తో కష్టమని పలు కామెంట్లు చేశారు. ‘‘ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదు. పగలు తీయాల్సిన సన్నివేశాలు ఉంటాయి.

కానీ ఆయన మాత్రం రాత్రి 8 గంటలకు సెట్స్‌కి వస్తే రాత్రి 2 గంటలకు వరకు షూట్ చేయాల్సి వచ్చింది. మేము తెల్లవారుజామున షూటింగ్ చేయడానికి అలవాటు పడ్డాం కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండేవి కాదే. ఓ సీన్‌లో నలుగురు పిల్లలుంటే.. వాళ్లు స్కూల్ నుంచి తిరిగివస్తున్న సీన్ చేసేది సాయంత్రం సమయంలో అయితే.. ఆ స్టార్ హీరో వల్ల వేకువజామున 2 గంటలకు షూటింగ్ చేయాల్సి వచ్చేది. ఆ టైంకి ఆ పిల్లలు నిద్రపోతారు కదా షూటింగ్ చేయడానికి చాలా కష్టమయ్యేది’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు సల్మాన్ ఖాన్ రాత్రి సమయాల్లో షూటింగ్‌లో ఎందుకు పాల్గొంటారో అని ఆలోచనలో పడ్డారు.

Next Story