- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
టాలీవుడ్ యంగ్ హీరో మౌళి తనూజ్(Mouli Tanuj), శివాని నాగరం (Shivani Nagaram)కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో మౌళి తనూజ్(Mouli Tanuj), శివాని నాగరం (Shivani Nagaram)కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts). సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చింది. హిట్‌గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన బాక్సాఫీసు వద్ద భారీ హిట్ కొట్టింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. సినీ సెలబ్రిటీల మనసులు సైతం గెలుచుకుని బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో చేరింది.
ఈ సినిమా కలెక్షన్స్ సైతం బాగానే వచ్చాయి. దీంతో ‘లిటిల్ హార్ట్స్’ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రియులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారికంగా ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమా ఈటీవీ విన్‌లో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ రోమ్-కామ్ మీ ఇంటికి వస్తుంది... ఈ సారి మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఎంటర్‌టైన్ చేయనుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కూపన్ ఆఫర్ ఇవ్వమంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.






