- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న ‘జూనియర్’ సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల (SreeLeela)సెకండ్ ఇన్నింగ్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల (SreeLeela)సెకండ్ ఇన్నింగ్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. వరుస సినిమాలతో పాటు ఐటమ్స్ సాంగ్స్‌లోనూ చిందులేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఇటీవల శ్రీలీల ‘జూనియర్’ (Junior)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా, గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి (Kiriti Reddy)హీరోగా నటించారు. ఇక ఇందులో జెనీలియా కీలక పాత్రలో కనిపించింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను.. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ఇక ఈ చిత్రం జూలై 18l రిలీజ్ కాగా.. వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల కుర్రకారులో హీట్ పుట్టించింది. ఇక ఈ సినిమా వచ్చిన రెండు నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే..ప్రేమ, కలలు ఆ షాకింగ్ నిజాన్ని జూనియర్‌లో కనుగొనండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ జాతర, పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్, లెనిన్, ఆషికి-3, దుబారి వంటి చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది.






