- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha-Raj Nidimoru: ఇట్స్ అఫీషియల్.. పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత.. గుక్కపెట్టి ఏడుస్తున్న అభిమానులు!
గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సమంత(Samantha)-రాజ్(Raj Nidimoru) నిడిమోరు నేడు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సమంత(Samantha)-రాజ్(Raj Nidimoru) నిడిమోరు నేడు రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే.. సమంత అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో ఉంగరాలు మార్చుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసి అందరికీ బిగ్ షాకిచ్చింది. ఇక ఇందులో క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్ ధరించిన రాజ్, రెడ్ కలర్ చీరలో ఉన్న సమంత గట్టిగా పట్టుకుని ఇంటి గడపదాటుతూ కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో పాటు పెళ్లి తర్వాత పూలదండలు వేసుకున్న వీరిద్దరు లింగ భైరవ ఆలయంలో జంటగా హారతి తీసుకుంటూ కనిపించారు.
మరొక ఫొటోలు చేతుల నిండా గోరింటాకు పెట్టుకున్న సమంత రాజ్ చేతిని గట్టిగా పట్టుకుని ఉంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతుండగా.. అభిమానులు మాత్రం గుక్కపెట్టి ఏడుస్తున్న ఎమోజీలు షేర్ చేస్తున్నారు. ఇంత పని చేస్తావనుకోలేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఇందుకోసమే వెయింటింగ్ సంతోషంగా ఉండాలని కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం సమంత-రాజ్‌లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తానికి సమంత తన రెండో పెళ్లి అందరికీ బిగ్ షాకిచ్చింది. ఎన్ని వార్తలు వచ్చినా సైలెంట్‌గా ఉండి.. సడెన్‌గా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి సమంత కూడా తన మాజీ భర్తలాగా కొత్త జర్నీ స్టార్ట్ చేసింది.






