అందరూ ఆస్వాదించేలా ఉండబోతుంది: ఆధిక్ రవిచంద్రన్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) వరుస సినిమాలు చేసినప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు.

అందరూ ఆస్వాదించేలా ఉండబోతుంది: ఆధిక్ రవిచంద్రన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) వరుస సినిమాలు చేసినప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు. అయినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆయన కెరీర్‌లో 64వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనుంది. దీనిని తమిళ బడా నిర్మాణ సంస్థ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఆధిక్, అజిత్ కాంబోలో కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావండంతో ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది. షూటింగ్ నవంబర్ స్టార్ చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు టాక్. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆధిక్ రవిచంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని ముఖ్యంగా అభిమానుల కోసం చేశాను. కానీ ‘AK64’ అందరూ ఆనందించే చిత్రం అవుతుంది. యాక్షన్, భావోద్వేగం, వినోదం అన్ని ఎమోషన్స్ ఉండి కుటుంబాలతో పాటు అభిమానులు ఆస్వాదించేలా ఉండబోతుంది’’ అని చెప్పుకొచ్చారు.

Next Story