" ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " మొదటి రోజు కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
 ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం  మొదటి రోజు కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లరి నరేష్ తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ సినిమాలతోనే ఎదిగాడనే చెప్పుకోవాలి. " అల్లరి " సినిమాతో హిట్టు అందుకొని అల్లరినరేష్ గా తన పేరును మార్చుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి తన సినీ కెరియర్లో విజయాల కంటే అపజయాలనే ఎక్కువ చూసాడు. అయినా కూడా సినిమాలను మాత్రం వదిలిపెట్టలేదు. మహర్షి సినిమాతో విజయం హిట్టు కొట్టి.. తర్వాత వచ్చిన " బంగారు బుల్లోడు " ఫ్లాప్ గా నిలిచినా.. " నాంది " సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. " నాంది " సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేపించుకున్నాడు. " ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు ఈ విధంగా కలెక్షన్స్ సాధించాయి.

నైజాం - 0.15 L

సీడెడ్ - 0.08 L

గుంటూరు - 0.05 L

కృష్ణ - 0.06 L

నెల్లూరు - 0.03 L

ఉత్తరాంధ్ర - 0.09 L

ఈస్ట్ - 0.04 L

వెస్ట్ - 0.02 L

ఏపీ + తెలంగాణ - 0.51 L

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.04 L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 0.55 L

ఈ సినిమాకు రూ.04.10 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌‌ సాధించాలంటే రూ. 04.35 కోట్లు వసూలు చేయాలి. ఈ సినిమా మొదటి రోజు రూ.0.55 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.



Also More......

" మసూద " సినిమా 8 డేస్ కలెక్షన్స్

Next Story