బతకడానికి చాలా కష్టంగా ఉండేది.. ఆ బాధ భరించలేక చనిపోదామనుకున్నా: నవాజుద్దీన్ సిద్ధిఖీ

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడమే కాకుండా హీరోగానూ బిగ్ స్క్రీన్‌పై కనిపించారు.

బతకడానికి చాలా కష్టంగా ఉండేది.. ఆ బాధ భరించలేక  చనిపోదామనుకున్నా: నవాజుద్దీన్ సిద్ధిఖీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడమే కాకుండా హీరోగానూ బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఆయన అమ్మాయిల పాత్రలో లేడీ గెటప్‌లో కూడా నటించి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఇటీవల ‘థామా’(Thamma)తో ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ దక్కింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలోని జరిగిన విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోయాయి. నా స్థానంలోకి వేరే వారిని తీసుకున్నారని అన్నారు. అప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా మారడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయాడట. దరిద్రం వెంటాడుతోందనుకుని.. 8 సంవత్సరాలు దుర్భలమైన జీవితాన్ని గడిపినట్లు తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ సమయంలో తన ముగ్గురు స్నేహితులు కూడా తనను వదిలి ప్రాణాలు కోల్పోవడం.. ఆ బాధ మరింత ఎక్కవైంది. వాళ్లు లేని జీవితం చాలా కష్టతరంగా అనిపించింది. దీంతో నేను ఓ నిర్ణయానికి వచ్చాను. ఒకసారి రైలులో ప్రయాణించే సమయంలో అందులోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని డోర్ దగ్గరకు వెళ్లాను.. కానీ దూకే ముందు.. జీవితాన్ని మధ్యలో ముగించకూడదన్న ఆలోచన రావడంతో ధైర్యంగా ముందుకు సాగాలని అనుకున్నాను. ఈ సమయంలోనూ తన కొచ్చిన మూడు ప్రాజెక్టులు హిట్ అందుకుని తన జీవితాన్ని మార్చేసినట్లు తెలిపారు. అలా ఇప్పటివరకు వరుస చిత్రాలు చేస్తున్నా.. వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థి ఏర్పడలేదని అన్నారు.

Next Story