- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అరుదు.. ఆ సీన్ నుంచి బయటకు రావడం కష్టంగా ఉంది..
అఖిల్ రాజ్(Akhil Raj), తేజస్విని(Tejaswini) జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’(raju weds rambai).

దిశ, సినిమా: అఖిల్ రాజ్(Akhil Raj), తేజస్విని(Tejaswini) జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’(raju weds rambai). ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సాయిలు కంపాటి దర్శకత్వంలో రాబోతుండగా.. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. తాజాగా, జరిగిన ఇంటర్వ్యూలో హీరో, అఖిల్ రాజ్, హీరోయిన్ తేజస్విని సినిమా హైలైట్స్ తెలిపారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయి. ప్రేమకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ధైర్యంగా నిలబడతాడు రాజు. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులు ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారు అనేది ఈ మూవీ కథ’’ అని అన్నారు. అనంతరం హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ.. డైరెక్టర్ యదు వంశీ ద్వారా ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం గురించి తెలిసింది.
ఇందులో రాంబాయి క్యారెక్టర్‌కు నేను సరిపోతానని సెలెక్ట్ చేశారు. రాంబాయి పాత్రలో అనేక లేయర్స్ ఉన్నాయి. తను ప్రేమికుడు రాజు దగ్గర క్యూట్‌గా హ్యాపీగా ఉంటుంది. హీరోయిన్స్‌కు ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అరుదు అనే చెప్పాలి. క్లైమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు పర్సనల్‌గా చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ మూవీ చివరి 30 నిమిషాలు హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. నటించిన తర్వాత ఆ సీన్ నుంచి బయటకు రావడం కష్టంగా ఉంది. ఈ నెల 21న మా మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది.






