- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది.. స్పెషల్ పర్సన్‌ను పరిచయం చేస్తూ రష్మిక పోస్ట్
ఛావా, యానిమల్ వంటి వరుస హిట్స్ తర్వాత ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకులను ప్రేమలో పడేసిన నేషనల్ క్రష్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

దిశ, సినిమా: ఛావా, యానిమల్ వంటి వరుస హిట్స్ తర్వాత ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకులను ప్రేమలో పడేసిన నేషనల్ క్రష్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)విడుదల కాగా.. ఈ మూవీపై ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే రష్మిక మందన్న(Rashmika Mandanna) నటన అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే రష్మిక కూడా అభిమానులకు రిప్లై ఇస్తూ బాగా దగ్గరవుతోంది. తాజాగా, మహిళల గొప్పతనాన్ని చెప్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. అలాగే తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్పెషల్ పర్సన్ తన ఫ్రెండ్‌ను పరిచయం చేస్తూ.. ‘‘స్త్రీలలో ఏదో అద్భుమైన శక్తి దాగుంది. దాన్ని ఎలా మీ అందరికీ వివరించాలో నాకు అర్థం కావడం లేదు. స్నేహితురాలితో అనుబంధం ఏర్పరుచుకోవడం వల్ల జీవితంలో జరిగే కొన్ని విషయాలు ముందే తెలుస్తాయని అనిపిస్తుంటుంది.
మహిళలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ.. ఒకరి సమస్యలు మరొకరు విన్నప్పుడే వారిద్దరి జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకుని ధైర్యాన్ని ఇవ్వాలి. ఫ్రెండ్స్ నీకు నేనున్నాను అని భరోసానిస్తారు. స్త్రీ శక్తి బలం తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నా జీవితంలో నా ఫ్రెండ్స్ నాకు అండగా నిలుస్తూ నన్ను రక్షిస్తున్నారు. ఇన్నాళ్లు నేను అమ్మాయిలు బలహీనమైన వారని అనుకునే దాన్ని. కానీ వారు బలవంతులు, ప్రేమగా ఉండే వ్యక్తులని నాకు ఇప్పుడే అర్థమైంది. నా జీవితంలో ఉన్నట్లుగా మీ లైఫ్‌లోనూ గొప్ప స్నేహితురాల్లు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అలాంటి వారిని పొందుతారని నేను ఆశిస్తున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే తన స్నేహితురాలితే నడుస్తున్న వీడియోను షేర్ చేసింది. కానీ ఆమె ముఖాన్ని మాత్రం చూపించలేదు.






