- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పటికైనా స్త్రీలను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. అను ఇమాన్యుయేట్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమాన్యుయేల్(Anu Emmanuel) ఒకప్పుడు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమాన్యుయేల్(Anu Emmanuel) ఒకప్పుడు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొద్ది కాలంపాటు సినిమాలకు దూరం అయింది. ఇటీవల మళ్లీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించగా.. ఆమె స్నేహితురాలిలాగా అను నటించి తన నటనతో ప్రశంసలు పొందింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చాలామంది అమ్మాయిలను ఇన్‌స్పైర్ చేస్తోంది. అలాగే కొందమంది మహిళలను కన్నీరు పెట్టేలా చేస్తూ..ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం నింపుతోంది. అను ఇమాన్యుయేల్‌కు ఈ సినిమా కలిసొచ్చిందని చెప్పొచ్చు.
మంచి పాజిటివ్ టాక్‌తో పాటు అమ్మడు చేసిన పాత్ర అందరికీ కనెక్ట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అను పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘కొంతమంది స్త్రీలు ఇష్టంతోనే ఇంట్లో ఉండిపోయి, తమ పిల్లలను కుటుంబాలను చూసుకుంటారు..అది తప్పు కాదు!! ఉద్యోగం చేయాలి, తమకంటూ గుర్తింపు పొందాలనుకున్నప్పుడు తమ ఇష్టానికి విరుద్ధంగా ఉండిపోతేనే అది తప్పు అవుతుంది. మా సినిమాలో కూడా ఇలాంటివే చూపించాము. అమ్మాయిలకు నచ్చినట్లు ఉండొచ్చు.
అంతేకానీ ఒకరు చెప్పుచేతల్లో కాదు. వారికి నచ్చిన జీవితాన్ని గడిపే వారు సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంట్లో వాళ్ళు, చేసుకున్న భర్తనో వారిని కంట్రోల్ చేస్తున్నారు. కానీ అది ముమ్మాటివి తప్పు. మగవారికి ఉన్నట్లే ఆడవాళ్లకు ఇష్టాలు, గోల్స్ ఉంటాయని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






