- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం: మమిత బైజు
నేను మొదటి నుంచీ ధనుష్ గారి నటనకు పెద్ద అభిమానిని. ఆయన సినిమాల్లోని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ను నేను చాలా నిశితంగా గమనిస్తుంటాను.

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఆ మూవీలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ భామ, ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కేవలం మలయాళంలోనే కాకుండా, ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. మమిత బైజు ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన ‘విశ్వానాథ్ అండ్ సన్స్’లో కథానాయికగా నటిస్తోంది. అలాగే, దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’లో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక ఆమెకు లైఫ్ ఇచ్చిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ప్రేమలు-2’లో కూడా మమిత నటిస్తుండటంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ సరసన ‘కారా’ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 30న థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో మమిత ‘సెల్లి’ అనే పాత్రలో ఒక విభిన్నమైన లుక్‌లో కనిపించబోతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మమిత, ధనుష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నేను మొదటి నుంచీ ధనుష్ గారి నటనకు పెద్ద అభిమానిని. ఆయన సినిమాల్లోని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ను నేను చాలా నిశితంగా గమనిస్తుంటాను. ‘కారా’ సెట్స్‌లో ఆయనతో కలిసి నటించడం నాకు ఒక యాక్టింగ్ స్కూల్‌లో ఉన్నట్లు అనిపించింది. ఆయన సెట్స్‌లో తన సహనటులకు ఎంతో స్వేచ్ఛను, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు. ఆయన నుంచి నటనలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. ధనుష్ సర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం" అని మమిత చెప్పుకొచ్చింది. మొత్తానికి, 'ప్రేమలు' పిల్ల తన టాలెంట్‌తో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది. అటు గ్లామర్, ఇటు పర్‌ఫార్మెన్స్‌తో మెప్పిస్తున్న మమిత, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.






