ఇషాన్ కిషన్ షాట్లకు గర్ల్ ఫ్రెండ్ ఫిదా.. అదితి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
ఇషాన్ కిషన్ షాట్లకు గర్ల్ ఫ్రెండ్ ఫిదా.. అదితి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ఆసియా కప్‌లో భాగంగా శనివారం జరిగిన ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. కాగా ఈ హ్యాపీ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ కిషన్ గర్ల్ ఫ్రెండ్, మోడల్ అండ్ బిజినెస్ ఉమెన్ అదితి హుందియా నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.

ఈ మేరకు ఇషాన్ 82 పరుగుల వద్ద ఔట్ అయి నిరాశతో పెవిలియన్ చేరుతున్న స్ర్కీన్ షాట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ ‘డ్రీమ్ ఇన్నింగ్స్’ అంటూ హర్ట్ ఎమోజీలు జతచేసి ప్రియుడి ఆటతీరుపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఇషాన్ ఇన్నింగ్స్‌పై పాజిటీవ్ కామెంట్స్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇక వీరిద్దరి రిలేషన్‌షిప్‌ విషయానికొస్తే చాలాసార్లు పార్టీ, పబ్‌లతో పాటు బహిరంగంగానే కెమెరా కంటికి చిక్కిన ఈ జోడి తమ డేటింగ్ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.


Next Story

Most Viewed