- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండ నటించిన సీరియల్ ఏదో తెలుసా?
అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫాలోయింగ్‌నే కాకుండా స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు.ప్రస్తుతం విజయ్ తన 34 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు

దిశ, వెబ్‌డెస్క్ : అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫాలోయింగ్‌నే కాకుండా స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు.ప్రస్తుతం విజయ్ తన 34 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. కాగా,విజయ్‌కు సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ హీరోగా చేయడం కంటే ముందు చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్, ఎవడే సుబ్రమణ్యం లాంటి చాలా సినిమాల్లో నటించాడు. అయితే ఈయన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో ఈయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో , పెళ్లి చూపులు సినిమాకు హీరోగా సెలక్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఈయన లైఫ్ టర్న అయ్యిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
అయితే విజయ్ సినిమాల్లోనే కాదండోయ్, సీరియల్స్‌లో కూడా నటించాడంట. విజయ్ ఏపీలోని పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదవుతున్న క్రమంలో , శ్రీ సత్య సాయి బాబాజీవిత చరిత్ర అనే సీరియల్‌లో నటించాడంట.
Read more:
విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. ‘ఖుషి’ నా రోజా నువ్వే ఫస్ట్ సింగిల్ రిలీజ్.






