- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాంతార’ హీరోయిన్ సప్తమీ గౌడలో ఇంత విషయం ఉందా..?
భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార’ కూడా ఒకటి.

X
దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార’ కూడా ఒకటి. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్‌ను అందరినీ అలరించి, రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సప్తమీ గౌడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అయితే తాజాగా సప్తమికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆమె.. స్కూల్, కాలేజీ రోజుల్లోనే రాష్ట్ర జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని బోలెడు పథకాలు సాధించిందట. ఆ తర్వాత నటన మీద ఆసక్తితో మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్‌గా ఎదిగింది సప్తమి.
Read More: ఆసక్తికరంగా కంగనా రానౌత్ ‘తేజస్’ టీజర్..
Next Story






