యాంకర్ సుమలో ఈ యాంగిల్ కూడా ఉందా.. వైరలవుతోన్న పిక్స్!

by Anjali |
యాంకర్ సుమలో ఈ యాంగిల్ కూడా ఉందా.. వైరలవుతోన్న పిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: గత పాతికేళ్లుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని దక్కించుకుంది బుల్లితెర స్టార్ యాంకర్ సుమ. కన్నడ అమ్మాయైనా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, అగ్ర హీరోల ఈవెంట్లలో తెగ సందడి చేస్తుంటుంది. సుమ డ్రెస్సింగ్ విషయానికొస్తే.. ఈమె చాలా సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఎంతో నిండుగా కనిపిస్తుంది. కాగా, ఇటీవల సుమ కాస్త ట్రెండ్ ఫాలో అవుతూ లేటెస్ట్ ట్రెండీ వేర్ ధరిస్తూ.. ఆడియన్స్‌ను అలరిస్తుంది. తాజాగా ఈ యాంకర్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబోలో డ్రెస్ వేసుకుని అదిరిపోయే ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ‘సుమక్కలో ఈ యాంగిల్ కూడా ఉందా?’ అంటూ కొంతమంది జనాలు కామెంట్లు చేస్తున్నారు. ట్రెండీ వేర్ ధరించిన ఎలాంటి గ్లామర్ షో చేయకుండా దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: అనిరుధ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన జైలర్ సినిమా నిర్మాత



Next Story