Prabhas, Maruti సినిమా ఉందా? క్యాన్సిల్ అయిందా?

by Disha Web Desk 10 |
Prabhas, Maruti సినిమా ఉందా? క్యాన్సిల్ అయిందా?
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల లిస్టు పెద్దగానే ఉంది. ప్రభాస్‌ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేదు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ అభిమానులు సలార్, కల్కి పైన ఆశలు పెట్టుకుని ఉన్నారు. సలార్ సినిమా రెండు పార్టులుగా మన ముందుకు రాబోతుంది. కల్కి సినిమా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి కనీసం ఏడాది పాటు సమయం పడుతుంది. ప్రభాస్‌ తన తదుపరి సినిమా మారుతి దర్శకత్వం లో చేయాల్సి ఉంది.. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టేశారని వార్తలు వస్తున్నాయి. నిర్మాత ఇప్పటికే ప్రభాస్‌, మారుతి సినిమా పై పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడట. ఇలాంటి సమయంలో హోల్డ్ లో పెట్టడం వల్ల నిర్మాతకు భారీ నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అసలు సినిమా చేస్తారా ? చెయ్యరా? అనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.



Next Story

Most Viewed