- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కె-ర్యాంప్’ అంటే బూతు పదమా?.. అసలు విషయం రివీల్ చేస్తూ కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ ర్యాంప్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ ర్యాంప్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘కె-ర్యాంప్’(K-Ramp) చిత్రంతో రాబోతున్నాడు. జైన్స్ నాని(Jains Nani) దర్శకత్వంలో రాబోతున్న సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 11వ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. ఇందులో యుక్తి తరేజా (Yukti Tareja)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్‌పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ‘కె-ర్యాంప్’ మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కె-ర్యాంప్ అంటే అందరూ బూతు పదం అనుకుంటున్నారు. ఇందులో నా క్యారెక్టర్ కుమార్ కాబట్టి అలా పెట్టారు.
బూతులు మా సినిమాలో ఉండవు. ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు కూడా కిరణ్ ఏంటి ఇలాంటి డైలాగ్‌కు చెప్పాడని అనుకోకండి. మా చిత్రం అన్ని ప్యామిలీస్ చూసేలాగా ఉంటుంది. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా క్యారెక్టర్ చాలా చిల్లరగా ఉంటుంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ముందుగానే క్యారెక్టర్ గురించి రివీల్ చేస్తున్నాను. పండగకు వస్తున్నాం.. ఈ సారి నాలుగు రోజులు వస్తుంది. ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు.. ‘కె-ర్యాంప్’ మళ్లీ మళ్లీ చూస్తారు. అక్టోబర్ 18 చాలా గట్టిగా నవ్వుతారు.జైన్స్ నాని నాకు కథ చెప్పినప్పుడు రెండున్నర గంటలు నవ్వుతూనే ఉన్నాను. థియేటర్స్‌లో మీరు కూడా కూర్చుని నవ్వుకునే వైబ్ ఉన్న సినిమా. ఈ చిత్రం విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నాకు మాత్రం నాని రూపంలో మంచి బ్రదర్ దొరికాడు’’ అని చెప్పుకొచ్చాడు.






