చై సామ్ విడిపోవడానికి కారణం ఆ గాసిప్పేనా..చివరకు ఫ్యాన్స్ కనిపెట్టేశారుగా?

by samatah |
చై సామ్ విడిపోవడానికి కారణం ఆ గాసిప్పేనా..చివరకు ఫ్యాన్స్ కనిపెట్టేశారుగా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు సమంత, నాగచైతన్యనే. అలాంటి జంట విడిపోయి అందరికీ షాకిచ్చారు. ఇక వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా అటు అక్కినేని అభిమానులు, ఇటు సమంత అభిమానులు చాలా బాధపడ్డారు.

అయితే వీరు ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. దీంతో సోషల్ మీడియాలో అనేక రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఈ మధ్య నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్స్ వల్లే మేము విడిపోయామని తెలిపారు.

అయితే ఇలాంటి క్రమంలోనే ఇన్నాళ్లు ఆ గాసిప్ ఏంటా ?ఏంటా ..? అంటూ బుర్రపీక్కున్న అభిమానులు ..ఫైనల్లీ ఆ గాసిప్ ని కనిపెట్టేశారు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే . అలా నటిస్తే ఏ భర్త ఒప్పుకోడు. నాగచైతన్య కూడా బోల్డ్ గా నటించొద్దు డూప్ పెట్టుకోమంటూ సజీస్ట్ చేశారట. సమంత కూడా డూప్ పెట్టుకొని ఆ సీన్స్ చేసింది . అయితే కొన్ని మీడియా ఛానల్స్ సమంత డూప్ గా నటించలేదు ,నిజంగానే నటించింది.. అక్కినేని ఇంటి కోడలు ఇలా నటించడం దారుణం అంటూ వల్గర్‌గా ట్రోల్ చేశారు. దీని వల్లనే చై సామ్ విడిపోయారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: 53 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన సూపర్ మోడల్

Next Story

Most Viewed