- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళపతి విజయ్ చివరి ‘జననాయగన్’ సినిమా భగవంత్ కేసరికి రిమేకా?.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే
దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న చివరి సినిమా ‘జననాయగన్’(Jananayagan) పై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.

దిశ, సినిమా: దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న చివరి సినిమా ‘జననాయగన్’(Jananayagan) పై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమా బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’(Bhagavanth Kesari)కి రిమేక్ అన్న ప్రచారం వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు చేస్తున్న చివరి చిత్రమవడంతో ఈ రూమర్స్ మరింత హీట్ పెంచాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ‘జననాయగన్’ దర్శకుడు హెచ్. వినోద్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. భగవంత్ కేసరితో తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా అని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న రిమేక్ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఊహాగానాల ఆధారంగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఇది దళపతి మూవీ.. రిమేకా? ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తి పొంది తీశారా అన్న విషయంపై ప్రేక్షకులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. వచ్చి సినిమా చూడాలంటూ విజ్ఞప్తి చేశాడు.
దళపతి విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ కథ, బలమైన మెసేజ్‌తో ఈ చిత్రం రూపొందుతోందని కూడా ఆయన సూచించారు. ప్రత్యేకంగా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కథపై అనేక ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయని, అయితే అవన్నీ అభిమానుల క్రియేటివ్ ఆలోచనలే తప్ప నిజం కాదని దర్శకుడు స్పష్టం చేశాడు. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్నందున ప్రతి సీన్ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఫ్యాన్స్ ఆశలను మించేలా ‘జననాయగన్’ ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు. మొత్తానికి, ‘జననాయగన్’ రీమేక్ అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టే. కాగా.. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమిత బైజు, ప్రియమణి వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.






