యూట్యూబర్ నిఖిల్‌తో ప్రేమలో పడ్డ సురేఖావాణి కూతురు.. పిక్స్ వైరల్

by Disha Web Desk 17 |
యూట్యూబర్ నిఖిల్‌తో ప్రేమలో పడ్డ సురేఖావాణి కూతురు.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: సాధారణంగా సెలబ్రిటీల లవ్ మ్యాటర్ అంటే ఆడియన్స్‌కి ఆసక్తికరంగా ఉంటుంది. చిన్న హింట్ తెలిసినా సరే వారి నుంచి వచ్చే అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక తాజాగా ఒక కొత్త జంట వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సుప్రిత గురించి అందరికీ అంతగా తెలియకపోయిన సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారందరికీ సుప్రిత బాగా తెలిసి ఉంటుంది. తాజాగా లవ్ రిలేటెడ్ షోలో యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహతో స్టేజ్ షోలో జంటగా కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది సుప్రిత. దీంతోపాటు తాజాగా వీరిద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసి లవ్ సింబల్ కూడా జోడించారు. ఇంకేముంది ప్రేక్షకుల దృష్టి మొత్తం ఇప్పుడు ఈ జంటపైనే ఉంది. గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

Next Story

Most Viewed