ఆ హీరోను తీసుకుంటే డిజాస్టర్ పక్కా.. సినిమాను ఆపేయాలని నెటిజన్ల సూచన

by Disha Web Desk 7 |
ఆ హీరోను తీసుకుంటే డిజాస్టర్ పక్కా.. సినిమాను ఆపేయాలని నెటిజన్ల సూచన
X

దిశ, సినిమా : ఈ మధ్యే షారుఖ్ ఖాన్ హీరోగా ‘డాన్ 3’ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని హింట్ ఇచ్చారు. కానీ ఈ సినిమాలో షారుఖ్‌ కాకుండా రణ్‌వీర్ సింగ్ మెయిన్ రోల్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈమధ్య వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంటున్న ఈ యంగ్ రాకింగ్ స్టార్‌ను ఎంచుకోవడంపై నెటిజన్స్ నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

‘న్యూ డిజాస్టర్ లోడింగ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా హిట్ కావాలని అనుకుంటే షారుఖ్‌ను హీరోగా కంటిన్యూ చేయాలని మేకర్స్‌కు సూచిస్తున్నారు. కాగా అమితాబ్ బచ్చన్ తర్వాత షారుఖ్ ఖాన్ ‘డాన్’గా చరిష్మాటిక్ క్రిమినల్ మాస్టర్‌మైండ్ క్యారెక్టర్‌కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగా.. 2006లో వచ్చిన ఈ సినిమా హిందీ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసింది.

Read More: సెక్స్‌లో ఆడవారికంటే మగవారికి స్టామినా మ్యాగీ కంటే చీప్.. దీపికా పదుకొనె కామెంట్స్ వైరల్

బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన అనిల్ రావిపూడి.. వైరల్ వీడియో


Next Story