ఆసక్తికరంగా కంగనా రానౌత్ ‘తేజస్’ టీజర్..

by Disha Web Desk 6 |
ఆసక్తికరంగా కంగనా రానౌత్ ‘తేజస్’ టీజర్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రానౌత్, సర్వేశ్ మెవరా డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘తేజస్’. ఈ సినిమా దేశభక్తి కాన్సెప్ట్‌తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. (Oct 2 న) గాంధీ జయంతి సందర్భంగా స్వయంగా కంగనా ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది. ఈ మూవీలో కంగన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్‌గా నటించింది. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో.. చక్కని కథా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో కంగనా డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

మన దేశంపై ప్రేమ కోసం.. తేజస్ టేకాఫ్ కు సిద్ధమవుతోందని టీజర్లో చూపించారు. ఈ టీజర్లో కంగన వైమానిక దళ కమాండర్గా కనిపించింది. దేశం కోసం పోరాడిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా కంగనా లుక్ కూడా యాప్ట్ గా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది అంటూ.. కంగనా పోస్టులో రాసుకొచ్చింది. కాగా ఈ సినిమా అక్టోబర్ 27న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.


Next Story