సంక్రాంతి పోటీలో సత్తా చాటిన ‘హనుమాన్’.. పార్ట్-2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

by Disha Web Desk 9 |
సంక్రాంతి పోటీలో సత్తా చాటిన ‘హనుమాన్’.. పార్ట్-2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
X

దిశ, సినిమా: యువ హీరో తేజ సజ్జ-టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన హనుమాన్ మూవీ ఇవాళ విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12 భాషల్లో గ్రాండ్‌గా గ్రాండ్ రిలీజైంది. విడుదలైన ప్రతీ చోట పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అగ్ర హీరో మహేష్ బాబు ‘గుంటూరు కారం’కు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగి సక్సెస్ అయ్యారనే చెప్పారు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పలు థియేటర్లలో టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇదిలా ఉండగా..

‘హనుమాన్’ పార్ట్-2కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజ్ అప్డేట్ ఇచ్చారు. 2025లో హనుమాన్‌కు సీక్వెల్ రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. ముగింపుగా పార్ట్‌-2 ఉంటుందని.. దీనికి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Read More..

Hanuman Movie: ‘గుంటూరు కారం’ తగ్గింది.. ‘హనుమాన్’ స్పీడ్ పెరిగింది.. ఇది ఎవరు ఊహించని రిజల్ట్

Next Story

Most Viewed