ఇంట్రెస్టింగ్ అప్డేట్: ఆ దర్శకుడితో జతకట్టనున్న మెగాస్టార్ చిరంజీవి

by Disha Web Desk 9 |
ఇంట్రెస్టింగ్ అప్డేట్: ఆ దర్శకుడితో జతకట్టనున్న మెగాస్టార్ చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: రికార్డు బ్రేకింగ్ వసూళ్లు సాధించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తర్వాత ‘భోళా శంకర్’ సినిమాతో రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా.. ‘‘సోగ్గాడే చిన్ని నాయన’’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ ‘కళ్యాణ్ కృష్ణ’ దర్శకత్వంలో చిరంజీవి తండ్రి, కొడుకు(డబుల్ రోల్)పాత్రల్లో నటించనున్నారట. జులై లేదా ఆగస్టులో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని విశ్వసనీయ సమాచారం. అలాగే ఈ మూవీని ఎవరు నిర్మించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిగ్‌గా మారింది.

Read More... కేన్స్‌‌లో సమంత ‘శాకుంతలం’ సినిమాకు నాలుగు అవార్డులు.. పెద్ద జోక్ అంటున్న నెటిజన్స్



Next Story

Most Viewed