ఆ కలర్ బట్టలు వేసుకుంటే వీడు తేడా అనేవారు.. జగపతి బాబు ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2023-09-02 07:28:02  IST  )

టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో చేసి అలరించారు.

ఆ కలర్ బట్టలు వేసుకుంటే వీడు తేడా అనేవారు.. జగపతి బాబు ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో చేసి అలరించారు. ఇప్పుడు విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల అందరి సినిమాల్లో జగపతిబాబు నటిస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తున్నాడు. తాజాగా, జగపతి బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చాడు. ‘‘ జుట్టుకు రంగు వేసుకునే రోజులు ఉన్నప్పుడు ఈ రంగు బట్టలు వేసుకుంటే.. వీడు ఈ టైపు రా అన్నారు. ఇప్పుడు జుట్టుకు రంగు వేసుకుని అదే రంగు బట్టలు వేసుకుంటే అదిరింది అంటున్నారు. ఏంటో ఈ అర్థం కాని లోకం’’ అంటూ రాసుకొచ్చాడు.

Next Story