‘క్రిష్’ అభిమానులకు గుడ్ న్యూస్.. నాలుగో భాగం కోసం మొదలైన కసరత్తులు

by Disha Web Desk 7 |
‘క్రిష్’ అభిమానులకు గుడ్ న్యూస్.. నాలుగో భాగం కోసం మొదలైన కసరత్తులు
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అప్ కమింగ్ మూవీ ‘క్రిష్ 4’కు సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది. ఇండియన్ సూపర్ హీరో ‘క్రిష్‌’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కాగా ‘క్రిష్ 4’పై దర్శకుడు రాకేష్‌ రోషన్‌ ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మేరకు ‘‘క్రిష్‌-4’ కచ్చితంగా ఓ భారీ బడ్జెట్‌ మూవీ అవుతుంది. కానీ 10 సినిమాలకు బదులు నాలుగే తీయాలని నిర్ణయించుకున్నాను. ఈరోజుల్లో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేకపోతే థియేటర్లకు రావడం మానేస్తున్నారు. ఒక పెద్ద సినిమా ప్లాప్ అయితే కనీసం దాని ప్రొడక్షన్‌ ఖర్చులు కూడా రావడం లేదు. ఇలాంటి ఆందోళన కలిగించే విషయాలు నాకు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ ‘క్రిష్‌’నాలుగో భాగాన్ని రూపొందించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దానికి కొంత సమయం పట్టొచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే హృతిక్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ మూవీ కథ హృతిక్‌కు బాగా నచ్చడంతో ఇటీవలే ఫైనల్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకునేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయని, ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను సింగపూర్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం.


Next Story

Most Viewed