‘రామాయణ’ మూవీలో చాన్స్ రావడం ఒక వరం.. అదృష్టంగా భావిస్తున్నానంటూ నటుడు ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

లీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’(Ramayana).

‘రామాయణ’ మూవీలో చాన్స్ రావడం ఒక వరం.. అదృష్టంగా భావిస్తున్నానంటూ నటుడు ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’(Ramayana). నితేష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)-రాముడు, యష్-రావణుడు, సాయి పల్లవి-సీత, రవి దుబే-లక్ష్మణుడు, సన్నీ డియోల్-హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య మొదటి పార్ట్ దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. తాజాగా, ఈ సినిమాలో భరతుడిగా ఓ యంగ్ నటుడు ఆదినాథ్ నటించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదినాథ్ కొఠారే ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ‘‘ఇది ఒక వరం లాంటిది. భారత గడ్డపై నిర్మించిన అతిపెద్ద చిత్రం రామాయణ. ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన అతిపెద్ద చిత్రాలలో ఇది కూడా ఒకటి.

నేను ఇందులో భాగం కావడం కారణం అయిన ముఖేష్ ఛబ్రాకు నిజంగా రుణపడి ఉంటాను. భరత్ పాత్ర కోసం నన్ను ఎంచుకున్నందుకు నితేష్ సర్‌కు, నన్ను నమ్మి, ఇంత ముఖ్యమైన పాత్ర బాధ్యతను నాకు అప్పగించిన నమిత్ మల్హోత్రా సర్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశంలో అత్యంత ప్రణాళికాబద్ధమైన సినిమాల్లో ఇది ఒకటి అని నేను అనుకుంటున్నాను. దీన్ని దగ్గరగా చూసే అదృష్టం నాకు ఉంది. ఇంత పెద్ద చిత్రంలో ఈ అవకాశం లభించడం నా అదృష్టం, నటుడిగా, చిత్ర నిర్మాతగా, మానవుడిగా మాత్రమే కాదు, ఈ భారీ స్థాయి చిత్ర నిర్మాణాన్ని చూసే అవకాశాన్ని దక్కించుకున్నాను. నేను చదివిన అత్యుత్తమ స్క్రిప్ట్‌లలో ఇది ఒకటి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.

Next Story