Pawan Kalyan : పార్టీ పెట్టేబదులు టీడీపీలో చేరొచ్చు కదా.. పవన్ కళ్యాణ్‌‌ను ప్రశ్నించిన బాలయ్య

by Disha Web Desk 10 |
Pawan Kalyan : పార్టీ పెట్టేబదులు టీడీపీలో చేరొచ్చు కదా.. పవన్ కళ్యాణ్‌‌ను ప్రశ్నించిన బాలయ్య
X

దిశ, సినిమా: ఆహా వేదికలో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ సీజన్ 2' ప్రేక్షకులను ఎంతగానో అకటుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గన్నారు. ప్రోగ్రామ్‌లో భాగంగా బాలయ్య పవన్‌ను పాలిటిక్స్‌కు సంబంధించి ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. పవర్ స్టార్ కూడా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. 'మీకు ఈ స్టేట్‌లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కదా. మరి ఆ ఫ్యాన్ బేస్ ఎందుకని ఓటు బ్యాంకుగా మారలేదు?' అని బాలయ్య అడగ్గా.. పవణ్ కళ్యాణ్ స్పందిస్తూ '' సినిమా‌లో నాకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. ఎన్నికల విషయంలో ప్రజల నమ్మకాన్ని అంత సులభంగా పొందలేం, సమయం పడుతుంది. ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే.. ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలి' అన్నాడు. వెంటనే బాలయ్య ''సొంతంగా పార్టీ పెట్టే బదులు తెలుగుదేశంలోనే ఉండిపోవచ్చు కదా?'' అని అడగ్గా.. ''నాకంటూ కొన్ని మూల సిద్ధాంతాలున్నాయి. అధికారం అందరికీ అందాలన్నా, సాధికారత రావాలన్నా, సొంతంగా పార్టీ పెడితేనే మంచిదని భావించాను' అని పవన్ బదులిచ్చాడు.



Next Story

Most Viewed