‘జబర్దస్త్’ షో నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ!

by Disha Web Desk 23 |
‘జబర్దస్త్’ షో నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ!
X

దిశ, సినిమా: దాదాపు పదేళ్లుగా ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ఫామ్‌లో రన్ అవుతూ ఎంటర్‌టైన్‌మెంట్స్ షోల కంటే ఈ షో ఎక్కువగా టీఆర్‌పీతో రన్‌ అవుతుంది. ఇక ఈ షోకు ప్రజెంట్ ఇంద్రజ, రవిబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో చాలాసార్లు గొడవలు అయ్యాయి. గతంలో జడ్జీలుగా ఉన్న నాగబాబు, రోజా కంటెస్టెంట్‌పై ఫైర్ అయిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా అటువంటి ఘటన మరోసారి చోటుచేసుకుంది. మార్కుల విషయంలో తాగుబోతు రమేష్, వెంకీ టీమ్ మధ్య జరిగిన ఇష్యూతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొపంతో ఇంద్రజ స్టేజ్ దిగి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి: కీరవాణి, చంద్రబోస్‌లకు ఘన సన్మానం.. టీఎఫ్‌సీసీ ప్రెస్‌ నోట్ రిలీజ్



Next Story