‘ఎలిఫెంట్ విస్పర్స్’ ఆస్కార్ విజేతలను అభినందించిన ఇండిగో.. (వీడియో)

by Disha Web Desk 6 |
‘ఎలిఫెంట్ విస్పర్స్’ ఆస్కార్ విజేతలను అభినందించిన ఇండిగో.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’. ఈ సినిమా 95వ ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత బొమ్మన్, బెల్లి ఎలిఫెంట్ రఘు పేర్లు ఇండియా మొత్తం మార్మోగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ లో రెండు అనాథ ఏనుగులను దత్తత తీసుకున్న ఓ కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 39 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిల్మ్‌లో రెండు ఏనుగు పిల్లలైన రఘు, అము, వాటి సంరక్షకులు బొమ్మన్, బెల్లీ మధ్య విడదీయరాని బంధాన్ని చూపెట్టిన చిత్రం ఇది. అయితే ఆస్కార్ విజేతలు బొమ్మన్, బెల్లి ఇటీవల ఊటీకీ విమానంలో ప్రయాణిస్తుండగా ఇండిగో ఫ్లైట్‌లో ప్యాసెంజర్స్ అందరూ ప్రశంసించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed